(శ్రీల నరోత్తమ దాస ఠాకూరు రచించిన 'ప్రేమభక్తిచంద్రిక' నుండి)
(1) శ్రీ గురుచరణపద్మ, కేవలభకతిసద్మ
బందో ముయి సావధాన మతే
జాహార ప్రసాదే భాయ్, ఏ భవ తోరియా జాయ్
కృష్ణప్రాప్తి హోయ్ జాహా హో’తే
(2) గురుముఖపద్మవాక్య, చిత్తేతే కోరియా ఐక్య
ఆర్ నా కోరిహో మనే ఆశా
శ్రీ గురుచరణే రతి, ఏయి సే ఉత్తమగతి
జే ప్రసాదే పూరే సర్వ ఆశా
(3) చక్షుదాన్ దిలో జేయ్, జన్మే జన్మే ప్రభు సేయ్
దివ్యజ్ఞాన్ హృదే ప్రొకాశితో
ప్రేమభక్తి జాహా హోయితే, అవిద్యా వినాశ జాతే
వేదే గాయ్ జాహార చరితో
(4) శ్రీ గురు కరుణా సింధు, అధమ జనార బంధు
లోకనాథ్ లోకేర జీవన
హా హా ప్రభు కోరో దోయా, దేహో మోరే పదఛాయా
ఏబే జశ ఘుషుక్ త్రిభువన
(1) గురుదేవుని పాదపద్మములు శుద్ధ భగవత్సేవా ధామములు. ఆ పాదపద్మములకు నేను సావధానముతో వందనము చేయుదును. ప్రియమైన సోదరా (మనస్సుతో)! మనము గురుదేవుని కృపతోనే ఈ భవసాగరాన్ని దాటి శ్రీకృష్ణుని పొందగలము.
(2) గురుదేవుని ముఖపద్మము నుండి వెలువడిన వాఖ్యలను, నీ హృదయముతో ఏకము చేసుకొని మరేమీ ఆశించకు. గురుదేవుని చరణముల పట్ల ఆసక్తియే ఆధ్యాత్మిక పురోగతికి పరమోత్తమ మార్గము. వారి కృప ద్వారా ఆధ్యాత్మిక పరిపూర్ణతకు గల కోర్కెలన్నీ నెరవేర్చబడతాయి.
(3) ఆధ్యాత్మిక దృష్టిని ప్రసాదించిన గురుదేవులే నాకు జన్మజన్మలకు ప్రభువు. అతని కృప ద్వారానే హృదయమున దివ్యజ్ఞానము వెల్లడవుతుంది, ప్రేమభక్తి అనుగ్రహింపబడుతుంది. అజ్ఞానము నశిస్తుంది. కాబట్టి వేదాలు వారి గుణగణాలను కీర్తిస్తున్నాయి.
(4) ఓ గురుదేవా! నీవు కరుణా సాగరుడవు, అధమ జనులకు ఆప్తుడవు, మరియు అందరికీ ఉపదేశకుడవు. సర్వజనులకు జీవము నీవు. ఓ ప్రభూ! దయచేసి నా పై కరుణను చూపి, నీ పాదపద్మముల ఛాయను నాకు ప్రసాదించుము. నీ కీర్తి ముల్లోకాల్లో విస్తరించుగాక!