(దశవిధ నామాపరాధములు పద్మపురాణములో ఇట్లు వివరింపబడినవి)
(1) భగవంతుని నామమును ప్రచారము చేయుటలో జీవితమును ధారపోసిన భక్తులను దూషించుట.
(2) శివుడు, బ్రహ్మ మొదలగువారు విష్ణువుతో సమానులని గాని స్వతంత్రులని గాని భావించుట. ఒక్కొక్కప్పుడు కొందరు నాస్తికులు ఇతర దేవతలందరును దేవాదిదేవుడైన విష్ణువుతో సమానులని వాదించుదురు.
(3) ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశములను ఉల్లంఘించుట.
(4) వైదిక గ్రంథములను దూషించుట.
(5) హరేకృష్ణ జప మహిమ కేవలము కల్పితమని భావించుట.
(6) హరి నామములకు దుర్వ్యాఖ్యానము చెప్పుట.
(7) భాగవన్నామము చేయుచున్నామను అహంతో పాపకృత్యము లాచరించుట.
(8) హరేకృష్ణ మాహామంత్ర జపమును కర్మకాండలో ఒక భాగముగా పరిగణించుట.
(9) విశ్వాసము లేని వారికి భగవన్నామ మహిమను గూర్చి ఉపదేశించుట.
(10) భగవన్నామ జపములో సంపూర్ణ విశ్వాసము లేకుండుట, దివ్యనామ మహిమను వినిన తరువాత కూడ ఐహిక బంధములలో చిక్కుకుని ఉండుట. అశ్రద్ధగా జపము చేయుట.
ప్రతి వైష్ణవ భక్తుడు కృష్ణప్రేమను శీఘ్రముగ పొందగోరినచో ఇట్టి అపరాధములేవీ జరగకుండ జాగ్రత్తగా జపించవలెను.