ప్రసాద సేవ


మహాప్రసాదే గోవిందే నామ బ్రహ్మణి వైష్ణవే

స్వల్ప పుణ్యవతాం రాజన్ విశ్వసో నైవ జాయతే

    


ఎవరైతే పుణ్యకర్మలు చేయరో అట్టివారు దేవదేవునికి అర్పించిన ప్రసాదమును గాని, గోవిందుని నామములను గాని, వైష్ణవులను గాని విశ్వసించలేరు.



ప్రసాద సేవనము

(శ్రీల భక్తివినోద ఠాకూఆరు రచించిన 'గీతావళీ' నుండి)


శరీర అవిద్యా  జాల్, జడేంద్రియ తాహే కాల్,

  జీవే ఫేలే విషయ సాగరే

తార మధ్యే జిహ్వా అతి, లోభమాయ్ సుదుర్మతి,

  తాకే జేతా  కఠిన సంసారే

కృష్ణ బరో దోయామాయ్, కోరిబారే జిహ్వా జయ్,

  స్వప్రసాదన్న దిలో భాయ్

సేయ్ అన్నమృత పావో, రాధాకృష్ణ గుణ గావో,

 ప్రేమే డాకో చైతన్య నితాయ్


     ఓ సోదరులారా! ఈ భౌతిక ప్రపంచము ఒక అజ్ఞాన కూపము, మరియు ఇంద్రియములు మహా ప్రాణాంతక శత్రువులు. ఎందువలనంటే అవి ఆత్మను భౌతిక భోగమనే సంసారములోనికి తోస్తాయి. ఇంద్రియాలలో నాలుక అత్యంత కాంక్ష కలది మరియు నియత్రింపజాలనిది. ఈ ప్రపంచములో నాలుకను నియంత్రించుట అత్యంత దుర్లభము.


  ఓ సోదరులారా! మన నాలుకను నియంత్రించుటకై శ్రీ కృష్ణ భగవానుడు దయతో తన ఆహారములోని శేషాన్ని ప్రసాదరూపమున అనుగ్రహించెను. ఇప్పుడు దయచేసి  కృష్ణప్రసాదామృతాన్ని స్వీకరించండి, శ్రీ శ్రీ  రాధాకృష్ణుల గుణగణాలను కీర్తించండి. ప్రేమతో "చైతన్య! నితాయ్!" అని గొంతెత్తి పాడండి.