20 భక్తులకు:
కావలసిన పదార్థాలు:
ఆపిల్-3 కాయలు
దానిమ్మ-2 కాయలు
గింజలు లేని ద్రాక్ష (నలుపు లేదా ఆకుపచ్చ)-100 గ్రాములు
అరటి పళ్ళు-12
పాలు-3 లీటర్లు
పంచదార-400 గ్రాములు
సగ్గుబియ్యం-9 స్పూన్లు
కుంకుమపువ్వు-8 రేఖలు
యాలికలు-4
తయారీ విధానం:
1. ఆపిల్,అరటి పళ్ళు చాలా చిన్న చిన్న ముక్కలు కోయవలెను.
2. దానిమ్మ గింజలు వలిచి ఉంచవలెను.
3. ద్రాక్ష పళ్ళు సగానికి ముక్కలు చేయవలెను.
4. సగ్గు బియ్యం మెత్తగా మిక్సీలో పొడి చేయవలెను.
5. మెత్తని సగ్గు బియ్యం పొడి టీ నెట్లో వేసి జల్లించవలెను.
6. 9 చెంచాల సగ్గుబియ్యం పొడి ఉండవలెను.
7. ఒక గ్లాసు పాలల్లో 9 చెంచాల సగ్గుబియ్యం పొడి వేసి కలిపి ఉంచవలెను.
8. (2 గంటల) ముందు అర గ్లాస్ వేడి పాలల్లో కుంకుమపువ్వు వేసిఉంచవలెను.
9. మూడు లీటర్ల పాలు మరిగించి పొయ్య ఆర్పవలెను.
10. సగ్గుబియ్యం పొడి కలిపిన పాలు మరిగిన పాలల్లో కలుపుతూ వేయవలెను.
11. మళ్ళీ పొయ్యమంట వెలిగించి సన్న సెగ మీద బాగా ఉడికించాలి.
12. పొయ్యమంట ఆపవేసి పంచదార వేయవలెను.
13. కుంకుమపువ్వు పాలు యాలకుల పొడి వేసి కలపవలెను.
14. పాల పదార్థం కొంచెం కూడా వేడి లేకుండా బాగా చల్లార్చాలి.
15. చల్లారిన పాలపదార్థంలో పళ్ళు ముక్కలు వేసి కలపవలెను.
16. ఇప్పుడు తయారైన ఫ్రూట్ సలాడ్ ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో ఉంచవలెను.
20 భక్తులకు :
కావలసిన పదార్థాలు:
ఆవు పాలు-3 లీటర్లు
బాదంపప్పు-50 గ్రాములు
పంచదార-500 గ్రాములు
జీడిపప్పు-50 గ్రాములు
యాలికలు-4
కుంకుమపువ్వు-8రేఖలు(ఉన్నా లేకపోయిన పర్వాలేదు)
తయారీ విధానం:
1. బాదంపప్పు,జీడిపప్పు ముందు రోజు రాత్రి నీళ్లలో నానబెట్టాలి.
2. బాదంపప్పు,జీడిపప్పు నీళ్ళల్లో కడిగి మెత్తగా కొంచెం నీళ్ళు వేసి గ్రైండ్ చేయాలి.
3. పాలు మరగబెట్టి, మరిగిన తర్వాత జీడిపప్పు,బాదంపప్పు పల్చగా చేసిన గ్రేవీ వేసి ఉడకబెట్టాలి. స్టవ్ ఆఫ్ చేసి పంచదార వేసి యాలకుల గుండ వేసి కలపాలి.
4. కుంకుమపువ్వు వేసుకుందాం అనుకుంటే నాలుగు గంటల ముందు చల్లని పాలల్లో నానబెట్టి వేయాలి చల్లారాక ఫ్రిజ్లో పెట్టవలెను.
20 భక్తులకు :
కావలసిన పదార్ధాలు:
చిలకడ దుంపలు-1.5 కేజీ
బెల్లం-750 గ్రాములు
ఆవు నెయ్యి-2 చెంచాలు
ఉప్పు-అర చెంచా
దాల్చిన చెక్క-3(అంగుళం ముక్కలు)
నీళ్ళు-50 మిల్లీలీటర్లు
తయారీ విధానము:
1)చిలకడ దుంపలు నీళ్ళల్లో నానబెట్టి బాగా శుభ్రంగా కడగాలి.
2)చిలకడదుంపలకు తొక్కలు తీయకుండా అంగుళున్నర ముక్కలుగా కోయాలి.
3)కుక్కర్లో బెల్లం, నెయ్యి, 50 మిల్లీలీటర్లు నీళ్లు అంటే చిన్న టీ కప్పు నీళ్లు పోసి బాగా కరిగించాలి.
4)కరిగిన బెల్లం పాకం లో దుంప ముక్కలు వేసి, బెల్లం పాకం దుంప ముక్కల కి అంటుకునేలాగా పైకి కిందకి బాగా కలపాలి.
5)ఉప్పు, దాల్చిన చెక్క ముక్కలు వేయాలి.
6)కుక్కర్ మూత పెట్టి, పొయ్యి మంట మీడియం లో పెట్టి, ఒక్క కూత రానివ్వాలి. పొయ్యి మంట పూర్తిగా ఆపాలి.
7)10 నిమిషాల తరువాత మూత తీయాలి.
8)కుక్కర్ మూత తీసాక,బెల్లం పాకం కొంచెం పల్చగా ఉంటే పొయ్యి చిన్న మంట మీద వెలిగించి పాకం దగ్గర పడే వరకు కలపాలి.
20 భక్తులకు :
కావలసిన పదార్థాలు:
ఆవు పాలు - 3 లీటర్లు
సగ్గుబియ్యం - 375 గ్రాములు
బెల్లంలేదాపంచదార - 400 గ్రాములు
యాలికలు - 8
జీడిపప్పు - 25 గ్రాములు
కిస్మిస్ - 25 గ్రాములు
క్యారెట్ - 4దుంపలు
ఆవు నెయ్యి - వేయించడానికి సరిపడినంత
తయారు చేయు విధానము:
1.సగ్గుబియ్యం 8 గంటలు నీళ్లలో నానబెట్టాలి.
2.పాలు మరిగించిన తర్వాత సగ్గుబియ్యం లో నీళ్లు వంచేసి సగ్గుబియ్యం పాలల్లో వేయాలి.
3.క్యారెట్ కోరు నెయ్యిలో వేయించి సగ్గుబియ్యంతో పాటు పాలల్లో వేయాలి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత (ఐదు నిమిషాలు లేదా ఎనిమిది నిమిషాలు పడుతుంది ఉడకడానికి) పొయ్యమంట ఆపేసి బెల్లం లేదా పంచదార వేసి కరిగేవరకు కలపవలెను.
4.జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించి పరమాన్నంలో వేయవలెను. యాలకుల గుండ వేయవలెను
20 భక్తులకు :
కావలసిన పదార్థాలు:
సగ్గుబియ్యం ఒక గ్లాసు 150 గ్రా
బంగాళదుంపలు రెండు
వేరుశనగపప్పు ఒక కప్పు
పచ్చిమిర్చి ఆరు
అల్లం ఒక అంగుళం
జీలకర్ర ఒక చెంచా
కరివేపాకు ఒక రెమ్మ
కొత్తిమీర రెండు రెమ్మలు
నిమ్మకాయ ఒకటి
ఉప్పు తగినంత
తయారీ విధానం:
సగ్గుబియ్యం కడిగి, సగ్గుబియ్యం మునిగేలాగా అర అంగుళం పైకి నీళ్లు పోసి ఐదారు గంటలు నానబెట్టాలి. ఇప్పుడు ఉడకపెట్టిన బంగాళదుంపలు బాగా మెత్తగా చేసి నానిన సగ్గుబియ్యం లో వేసి అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర కరివేపాకు చిన్న ముక్కలుగా చేసి జీలకర్ర వేసి నిమ్మకాయ పిండి ఉప్పు వేసి వేయించిన వేరుశనగ గుళ్ళు బరకగా గ్రైండ్ చేసి అవి ఇందులో వేసి బాగా కలిపి వడలు చేసి నూనెలో మీడియంలో మంట పెట్టి వేయించవలెను
20 భక్తులకు :
కావలసిన పదార్థాలు:
ఆవు పెరుగు 2 లీటర్లు
పెద్ద సగ్గుబియ్యం(వరలక్ష్మి) 500 గ్రాములు
పచ్చిమిరపకాయలు 10
అల్లం 2అంగుళాలు
కరివేపాకు 6రెమ్మలు
కొత్తిమీర గుప్పెడు
మిరియాలు 10గింజలు
జీలకర్ర 1చెంచా
ఉప్పు తగినంత
జీడిపప్పు 1చెంచా
బాదం 1చెంచా
నెయ్యి వేగించడానికి
నీళ్ళు 1.5 లీటరు
ఎండుమిర్చి 4
క్యారెట్ 2
తయారీ విధానం:
1. సగ్గుబియ్యం ఎక్కువ నీళ్ళల్లో 8 గంటలు పాటు నానబెట్టవలెను.
2. (1.5 లీటరు) నీళ్ళు మరిగించి సగ్గుబియ్యం లో ఉన్న నీళ్లు వంపి వేసి
మరుగుతున్న నీళ్లలో సగ్గుబియ్యం వేయవలెను.
3. సగ్గుబియ్యం ఉడకడానికి 5 నిమిషాలు లేదా 8 నిమిషాలు పడుతుంది
సగ్గుబియ్యం బాగా మెత్తగా ఉడికించవలెను.
4. ఉడికిన సగ్గుబియ్యం వేడి కొంచెం కూడా లేకుండా బాగా చల్లార్చ వలెను.
5. ఉడికించిన సగ్గుబియ్యం బాగా చల్లారిన తర్వాత పెరుగు,ఉప్పు వేసి కలపవలెను.
6. తాలింపు:జీడిపప్పు, బాదంపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి
ముక్కలు, క్యారెట్ కోరు వేగించి దద్దోజనంలో కలపవలెను.
7. మిరియాల పొడి దద్దోజనం లో కలపవలెను.
8. తురిమిన కొత్తిమీర దద్దోజనంలో వేయవలెను.
20 భక్తులకు :
కావలసిన పదార్థాలు:
బంగాళదుంపలు-1.5 కేజీ
దాల్చిన చెక్క-2 అంగుళాలు
జీలకర్ర-1 చెంచా
ఎండు మిరపకాయలు-4
నిమ్మకాయలు-2
నూనె
ఉప్పు
తయారీ విధానం:
1. దాల్చిన చెక్క,జీలకర్ర,ఎండు మిరపకాయలు,
నూనె లేకుండా వేగించి మొరుంగా మిక్సీలో పొడి చేయాలి.
2. బంగాళదుంపలు శుభ్రంగా కడిగి రెండు చెక్కలు చేసి తొక్కల తోటే
ఉడకబెట్టవలెను బాగా మెత్తగా ఉడకపెట్టకూడదు. దించేముందు ఉప్పు వేసి
ఒకసారి ఉడకబెట్టాలి.బాగా చల్లార్చాలి.
3. ఒక గిన్నెలో రెండు గుంట గరిటెల నూని వేసి తొక్కల తోటే బంగాళదుంపలు
వేగించాలి.బంగారు రంగు రావాలి.ఈ మసాలా పొడి వేసి రెండు సార్లు కలిపి
వేగించాలి. నిమ్మరసంలో ఉప్పు కలపాలి. ఒకసారి నిమ్మరసం వేసి వేగించాలి.
ఒక్క నిమిషం ఉండి అప్పుడు స్టవ్ కట్టేయాలి.
20 భక్తులకు :
కావలసిన పదార్థాలు:
వేరుశనగ గుళ్ళు-1కేజీ
క్యారెట్-100గ్రాములు
క్యాబేజీ-250గ్రాముల
టమోటా-250గ్రాములు
నిమ్మకాయ-1
జీలకర్ర-1 చెంచా
దాల్చిన చెక్క-1అంగుళం
మిరియాలు-1 చెంచా
లవంగాలు-4
ఎండు మిరప-1
పచ్చిమిర్చి-3
అల్లం-1అంగులం
ఉప్పు-తగినంత
నీళ్లు-తగినంత
కొత్తిమీర-గుప్పెడు
తయారీ విధానం:
1. వేరుశనగ గుళ్ళు 16 గంటల పాటు నీళ్లలో నానబెట్టువలెను.
2. వేరుశనగ గుళ్ళు శుభ్రంగా మంచినీళ్ళతో కడిగి ఉప్పు వేసి వేరుశనగ గుళ్ళు నీళ్లు కుక్కర్లో పోయవలెను ఎనిమిది కూతలు వచ్చే వరకు ఉడికించవలెను.
3. క్యాబేజీ క్యారెట్ కోరుచేసి పెట్టుకోవలెను.
4. అల్లం టమోటా పచ్చిమిర్చి ముక్కలు చేసి ఉంచుకోవాలి.
5. దాల్చిన చెక్క మిరియాలు లవంగాలు ఎండుమిర్చి జీలకర్ర నూనె లేకుండా వేయించి పొడి చేయవలెను.
6. ఉడికించిన వేరుశనగ గుళ్ళు లోని క్యారెట్టు క్యాబేజీ తురుము అల్లం ముక్కలు టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మసాలా పొడి తగినంత ఉప్పు, కొత్తిమీర నిమ్మరసం అన్ని కలపవలెను.
20 భక్తులకు :
కావలసిన పదార్థాలు:
సామలు-500 గ్రాములు
బంగాళదుంపలు-3
క్యారెట్-3
పచ్చిమిర్చి-4
దాల్చిన చెక్క-1అంగుళం
అనాసపువ్వు-1
బిర్యానీ ఆకు-2
అల్లం-1అంగుళం
యాలికలు-2
కరివేపాకు-3రెమ్మలు
తయారీ విధానం:
1. సామలు నీళ్లు పోసి బియ్యం కడిగినట్టు శుభ్రంగా కడగాలి.
2. ఒక గ్లాసు సామలకి రెండు గ్లాసులు నీళ్లు పోసి మూడు గంటల సేపు నానబెట్టాలి.
3. ఒక మూకుడులో నాలుగు స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాగాక బిరియాని ఆకు, అనాసపువ్వు,యాలకులు,దాల్చిన చెక్క లైట్ బంగారు రంగు వచ్చేవరకు వేయించి అప్పుడు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి కాసేపు వేయించాలి. అవి వేగాక బంగాళదుంప ముక్కలు చిన్న చిన్నవి కోసుకుని క్యారెట్ ముక్కలు సాల్టు వేసి మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు.వేగాక ఇప్పుడు నీళ్లతో ఉన్న సామలు నీళ్లతో సహా ఆ ముకిడిలో వేసి ఇప్పుడు ఇంకొంచెం సరపడ సాల్ట్ వేసి తక్కువ మంటలో మూత పెట్టి మగ్గనివ్వాలి. 8 లేదా 10 నిమిషాల్లో మగ్గిపోతుంది.