ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా
చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవేనమః
భావము: అజ్ఞానాంధకారములో గల నాకు జ్ఞానదీపముతో కళ్ళు తెరిపించిన శ్రీగురుదేవులకు నా గౌరవపూర్వక ప్రణామములు.
నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే
శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే
నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే
నిర్విశేషశూన్యావాదిపాశ్చత్యదేశతారిణే
భావము: శ్రీకృష్ణుని పాదపద్మముల వద్ద శరణాగతి పొంది, శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రులైన, పరమపూజ్యశ్రీ శ్రీమత్ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారికి నా గౌరవపూర్వక ప్రణామములు. ఓ గురుదేవా! సరస్వతీ గోస్వామి సేవకుడవైన మీకు మా ప్రణామములు. మీరు కరుణతో శ్రీ చైతన్య దేవుని బోధనలను ప్రచారము చేసి, నిరాకారవాదము మరియు శూన్యవాదముతో నిండి ఉన్న పాశ్చాత్య దేశములను తరింప జేయుచున్నారు.
జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభూ నిత్యానంద
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందా
భావము: శ్రీ చైతన్య మహాప్రభువు, శ్రీ నిత్యానంద ప్రభువు, శ్రీ అద్వైత ప్రభువు, శ్రీ గదాధర పండితునకు, శ్రీవాస పండితునకు ఇతర భక్త బృందమునకు నా ప్రణామములు.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
(పరమపూజ్య శ్రీమత్ ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారి వ్యాఖ్యానము)
భావము: "హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే" అను ఈ దివ్య శబ్ధ ఉచ్చారణ, మన కృష్ణ
చైతన్యమును పునరుద్ధరించుకొనుటకు గల సులభమార్గము. జీవాత్మలమగుట చేత నిజానికి మనమందరము కృష్ణచైతన్యము కలవారమే, కానీ అనాది
కాలముగా ఈ భౌతిక పదార్థముతో గల సాంగత్యము వలన మన చైతన్యము ఇప్పుడు భౌతిక వాతావరణముచే కలుషితమైనది.