హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
పైన పేర్కొనబడిన ఈ మహామంత్రము, కృష్ణుడు, దేవాదిదేవుడు, చెంతకు తిరిగి వెళ్ళుటకు సిఫార్సు చేయబడినది.
మంత్ర నందలి , 'మన్' అనగా 'మనస్సు', 'త్ర' అనగా 'విముక్తి కలిగించునది'. ఆ విధంగా, మంత్ర అనగా భౌతిక క్లేశముల నుండి 'మనస్సును విముక్తిని
కలిగించునది' అని అర్థము.
ఈ మహామంత్రము నందలి మూడు పవిత్ర నామములు హరే, కృష్ణ, మరియు రామ.
'హరే' అను పదము శక్తివంతమైనది, అది భగవంతుని యొక్క శక్తిని ప్రత్యక్షంగా సంబోధిస్తుంది.
'కృష్ణ', దేవదేవుడైన కృష్ణుని పేరు. ఈ విశ్వములో మరియు దాని వెలుపల గల ప్రతి గుణము కృష్ణుడు కలిగి ఉన్నాడు.
'రామ' అనగా ఆనంద సాగరం అని అర్థం. ఈ మహామంత్రాన్ని జపించుట ద్వారా మరియు కృష్ణునికి భక్తియుత సేవ చేయడం ద్వారా, ప్రతి ఒక్కరూ ఈ
సాగరానికి అనుసంధానము చెంది అంతులేని సంతోషాన్ని పొందవచ్చును.
భక్తి యోగ సాధనలో హరే కృష్ణ మంత్రాన్ని మృదువుగా ఎవరికి వారు జపించుట ఉన్నది. జప మాల నేలకు అంటకుండా మరియు శుభ్రముగా ఉండడానికి, సాధారణంగా ఒక సంచిలో పవిత్రమైన ఈ జప మాల నుంచి జపము చేస్తారు. జప సంచికి గల పెద్ద రంధ్రము చేతిని లోనికి పెట్టుటకు మరియు అవతలి చిన్ని రంధ్రము చూపుడు వేలుని బయటకు పెట్టుటకు ఉంటాయి. ఈ విధంగా జప మాలను సంచిలో ఉంచి జపము చేయండి.
భక్తి యోగ సాధకలు, వారు ప్రతి రోజూ కనీసం ఎన్ని మాలలు జపం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకుంటారు. జప మాల ముఖ్య ఉద్దేశం ఎన్ని సార్లు మహా మంత్రాన్ని జపించామో లెక్కించుటకే. వేల్లుతో పూసలను అదుముతు ఉండడం వల్ల కృష్ణుని పవిత్ర నామ శబ్ధము నందు దృష్టి పెట్టుటకు సహాయపడుతుంది.
జప మాల నందు 108 పూసలు మరియు కృష్ణ పూస అనబడు ఒక పెద్ద పూస ఉంటాయి. కృష్ణ పూసకు తరువాతి పూసతో మొదలు పెట్టి, పూసను కుడి చేతి బొటన మరియు మధ్య వేల్ల మధ్యన సున్నితంగా అదుముతూ హరే కృష్ణ మంత్రమును జపించవలెను.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
ఆ తరువాత, వేల్లను పక్క పూసకు మార్చుకుని మంత్రము చెప్పవలెను.
ఆ విధంగా మాల నందలి 108 పూసల మీద జపించవలెను. అప్పుడు ఒక మాల జపము చేసినట్లు అవుతుంది. దీనికి చాలా మందికి ఐదు నుండి పది నిమిషముల సమయం పడుతుంది.
ప్రతి మాల జపమునకు ముందు మూడు సార్లు పంచతత్త్వ మంత్రను కూడా జపించవచ్చును. ఇది జపము చేయునప్పుడు ఎలాంటి అపరాధము చేయకుండుటకు చైతన్య మహాప్రభువును మరియు ఆయన అనునాయులను సహకరించమని చేయు ప్రార్ధన.
జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభూ నిత్యానంద
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృందా
"శ్రీ చైతన్య మహాప్రభువు, శ్రీ నిత్యానంద ప్రభువు, శ్రీ అద్వైత ప్రభువు, శ్రీ గదాధర పండితునకు, శ్రీవాస పండితునకు ఇతర భక్త బృందమునకు నా ప్రణామములు."
మీరు ఒక మాల కంటే ఎక్కువ జపము చేస్తుంటే, కృష్ణ పూసను దాటకుండా - మాలను తిప్పి తర్వాతి మాల జపము చేయవలెను.
మీ వద్ద మాల లెక్కింపునకు ఒక పూసల తాడు ఉంటే దానిని మీ సంచికి కట్టుకుని, ప్రతి మాల జపము పూర్తి అవ్వగనే ఒక పూసను జరపండి.
మంత్రమును స్పష్టంగా జపిస్తూ మరియు శ్రద్ధతో వింటూ, జపము చేయడానికి ప్రయత్నించండి. కొందరికి మంత్రమును లేదా కృష్ణ పటమును చూస్తూ జపము చేయడం సహాయకరంగా ఉంటుంది. మీకు అది పనిచేస్తే, అలా చేయండి. ఏదేమైనా శ్రద్ధగా వినడం అనేది లక్ష్యం అని గుర్తుంచుకోండి.
హరే కృష్ణ మహా మంత్రమును సరియైన విధంగా ఎలా జపించాలి?
"నిష్, నిష్, రామ్, రామ్, నిష్, నిష్, రామ్, రామ్" ఒకసారి శ్రీల ప్రభుపాద ఈ విధంగా అనుకరిస్తారు, మనం ఏ విధంగానైతే కొన్ని సార్లు జపం చేయాలనిపించనపుడు ఏకాగ్రత లేకుండా, సరిగా ఉచ్ఛరించకుండా జపిస్తామో ఆ విధంగా.
ఈ విధమైన జపము వెనకటి మానసిక స్థితి మీకు తెలుసును; "నేను జపం చేయాలి కానీ నిజానికి నేను వేరే పని చేస్తుండాలి". మన మనస్సు నందలి ఆలోచన, "ఈ మాలలు పూర్తయ్యేవరకు నేను ఆగలేను, ఎప్పుడు ఈ మాలలు అవుతాయి అని". మనమందరం ఇలా చేస్తాం. ఇది చాలా తప్పు. టీవీ నందు ఆటలు వీక్షిస్తూ జపం చేయు కొందరు భక్తులు నాకు తెలుసును.
ఈ విధమైన జపము చాలా వరకు నిరుపయోగకరమైనది అని శ్రీల ప్రభుపాద తెలిపారు. ఎందుకనగా ఇది కోరిన ఫలితమును, కృష్ణ ప్రేమను, జనింపచేయదు. ఈ జపము నిర్విరామమైనది అని అనవచ్చు. ఇది చాలా వరకు ఒక పూజ. ఈ రకమైన జపము అంత ప్రయోజనకరమైనది కాకపోవు నప్పటికి, ఈ రకముగా జపించు వారు తమ ప్రమాణాన్ని కనీసం నిలబెట్టుకుంటున్నారు అని ఆ పూజ మాదిరి చేయు జపము నందలి విలువను శ్రీల ప్రభుపాద గుర్తించారు.
ఈ రకమైన జపమును నేను "మర్యాద జపము" అని పిలుస్తాను. "మర్యాద జపము" అనగా నీవు ప్రమాణం చేయుట వల్ల - ఆధ్యాత్మిక గురువునకు లేదా స్వతాహాగా - ప్రతి రోజు నియమిత మాలలు జపపించడం, పైన చెప్పినట్లుగా ఈ రకంగా జపించుటతో నీవు నీ ప్రమాణాన్ని నిలబెట్టుకుంటున్నావు.
"మర్యాద జపము" గా పిలువుబడు మరికొన్ని ఉదాహరణలు:
సంభాషిస్తూ జపించుట (నీవు మాట్లాడుతావు, అవతలి వారు మాట్లాడేటప్పుడు జపిస్తావు)
చదువునపుడు జపించుట (రెండు తలలు ఉంటే ఇది పని చేస్తుంది, ఒక తలతో చదవడం మరియు మరో దానితో జపించడం)
రేడియో లేదా CD వింటూ జపించుట (వార్తలు లేదా రాక్ & రోల్ సంగీతం వినునప్పుడు ఇది చాలా సవాలుగా ఉంటుంది)
షాపింగ్ చేయునపుడు జపించుట
విండో షాపింగ్ చేయునపుడు జపించుట (తెల్లవారుజామున జప వాకింగ్ చేయునప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది)
కునుకుపాట్లు పడుతూ జపించుట ( కొన్నిసార్లు ఇది డైవ్-బాంబ్ గా పిలువబడును)
చుట్టూ పక్కల ప్రదేశాలను లేదా ఒక కోటి వస్తువులను పరిశీలిస్తూ జపించుట (కొన్నిసార్లు ఇది రాడార్ జపముగా పిలువబడును)
సినిమాలు చూస్తూ జపించుట (కృష్ణ చైతన్య పరమైనవి కూడా "మర్యాద జపము" లోనికే వస్తాయి)
కొంచెం జపించుట, కొంచెం మాట్లాడుట, కొంచెం జపించుట, కొంచెం మాట్లాడుట (కొన్నిసార్లు ఇది జిబ్బర్ జపముగా పిలువబడును)
.............. చేయునపుడు జపించుట (మీకు నచ్చినది పూరించుకోండి)