కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు
కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు
"ప్రభుపాద" అనే బిరుదు సాహిత్యం సంకలనంలో లేదా ప్రపంచమంతటా ప్రచారం చేయుటలో అసాధారణమైన సహాయాసహకారాలు, కృషి చేసిన గొప్ప ఆధ్యాత్మిక గురువును సంబోధనకు ఉపయోగించుట సరియైనది. దీనికి ఉదాహరణలు శ్రీల రూప గోస్వామి ప్రభుపాద, శ్రీల జీవ గోస్వామి ప్రభుపాద, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాద.
ఇస్కాన్ సభ్యులు "ప్రభుపాద" అని మాట్లాడినపుడు, వారు కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదులను సంబోధిస్తున్నట్టు. ఆయన ప్రపంచ చరిత్రలో ధర్మమునకు సంబంధించి ఒక విశిష్ఠ స్థానాన్ని పొంది యుందుట వలన "శ్రీల ప్రభుపాద" అని సంబోధింపబడుట కూడా చాలా సరియైనది.
శ్రీమద్భాగవతం 1.5.11 లో శ్రీల వ్యాసదేవుడు భాగవతం గురించి ఇట్లు చెప్పెను "ఇది పాపపు జీవనంలోనున్న అస్తవ్యస్తమైన నాగరికులలో ఒక గొప్ప మార్పు తీసుకురావడానికి ఉద్దేశపడింది." శ్రీల వ్యాసదేవుల యొక్క ఈ వాక్యం శ్రీల ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు తీసుకువచ్చిన ప్రచార ఉద్యమమును సూచిస్తున్నది అని వైష్ణవ పండితులు గుర్తించారు. శ్రీల వ్యాసదేవుడు భాగవతమును రచించిన ఐదు వేల సంవత్సరాల తరువాత, భౌతిక అంధకారంలో గతితప్పిన యావత్ మానవ సమాజ యొక్క గొప్ప పునర్ ఆధ్యాత్మికీకరణ కొరకు తన ముఖ్యమైన సహకారముగా భాగవతమునకు భక్తివేదాంత భాష్యములను వ్రాసినది శ్రీల ప్రభుపాదులే.
శ్రీ చైతన్య మహాప్రభు కూడా తన నామము ఈ ప్రపంచంలోని ప్రతి నగరంలో మరియు గ్రామంలో ప్రచారం చేయబడుతుంది అని అంచనా వేశారు. కలి కాలంలోని పది వేల సంవత్సరాల స్వర్ణ కాలంలో కృష్ణ చైతన్యం వ్యాప్తి చేయబడుతుందని ఆయన సాంప్రదాయంలోని ఆచార్యులు అంచనా వేశారు. శ్రీ చైతన్య మహాప్రభు సందేశాన్ని విస్తృతంగా మరియు శక్తిమంతంగా ప్రచారం చేయడానికి ఒక గొప్ప సేనాపతి ఆవిర్భవించును అని చైతన్య మంగళ అనే గ్రంథంలో లోచన దాస ఠాకూర ముందేగానే పేర్కొన్నారు. కృష్ణ చైతన్యాన్ని ప్రపంచమంతా విస్తరింపజేయు గోప్యమైన కార్యం శ్రీల ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదులకు అప్పగించబడింది.
కృష్ణునిచే శక్తిమంతులైన వారు మాత్రమే జనుల హృదయాలలో కృష్ణ చైతన్యాన్ని నింపగలరు అని శ్రీ చైతన్య చరితామృతము ధృవీకరించింది. "అతి తొందరలోనే ప్రపంచమంతా కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చేయు ఒక గొప్ప వ్యక్తి ఆవిర్భవించును" అని గొప్ప వైష్ణవ ఆచార్యుడు అయిన శ్రీల భక్తివినోద ఠాకూర(1838-1914) అంచనా వేసేను. "ఆ వ్యక్తి స్పష్టంగా శ్రీల ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాదులే."
ఒక వైష్ణవుని గొప్పతనం అతను ఎంత మంది అభక్తులను వైష్ణవులుగా మార్చగలిగారో చూసి దాని బట్టి అర్థం చేసుకోవచ్చు అని భక్తి వినోద్ ఠాకూర చెప్పెను. ఉన్నత అర్హత గల వ్యక్తినే కృష్ణ చైతన్యం వైపు తీసుకురావడం కష్ఠం. కానీ శ్రీల ప్రభుపాదులు కృష్ణుని వల్ల ఎంత శక్తిని పొందారు అంటే అస్సలు మార్చడానికి వీలు కాని పాశ్చాత్య దేశాలలోని ఇంద్రియ భోగాలతో మునిగిన వేలాది యువతను భక్తులుగా చేసారు. శ్రీల ప్రభుపాదల ఘనతను ఎవ్వరూ కూడా పూర్తిగా అర్థంచేసుకోలేరు. వైదిక సంస్కృతి నుండి విడివడినవారును, సాధువులను ఎలా ఆదరించాలో తెలియని వారు, మాంస భక్షణ, అక్రమ సంబంధం, జూదం, మరియు మత్తు పానీయాలు తీసుకోవడమును విరివిగా ప్రోత్సహించు సంఘంలో పెంచబడ్డ వారుల మధ్యకు ఆయన ఒంటరిగా వెళ్లారు. ఇంచుమించుగా వాళ్ళు ఆధ్యాత్మిక జీవనానికి పూర్తిగా అనర్హులు.
అయినప్పటికి శ్రీల ప్రభుపాద అటువంటి వ్యక్తుల మధ్యకి వెళ్లడమే కాకుండ క్రమంగా వాళ్ళలో చాలా మందికి శిక్షణనివ్వగలిగారు. ఆ శిక్షణతో వాళ్ళు ఉత్తమ వైష్ణవులుగా అంగీకరింపబడ్డారు మరియు ఇతరులకు కృష్ణ చైతన్యంలో శిక్షణ ఇచ్చుటకు అర్హులైనారు.
భారతదేశం నందు విద్వాంసులైన, భక్తికి అంకితమైన మరియు సన్యసించిన వైష్ణవులు ఖచ్చితంగా చాలా మందే ఉన్నారు. కానీ వాస్తవమేమిటంటే శ్రీల ప్రభుపాద ఒక్కరే కావలిసినంతగా ప్రపంచమంతటా కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తి చేయగలిగారు. భారతదేశం వెలుపల కృష్ణ చైతన్యమును వ్యాప్తి చేయుటకు శ్రీ చైతన్య మహాప్రభు సూచనలయందు, తన ఆధ్యాత్మిక గురువు ఆజ్ఞలయందు, కృష్ణ నామమందు తగినంత విశ్వాసం ఆయనొక్కరికే ఉన్నది. అత్యంత అవసరమైన వారికి శ్రీ చైతన్య మహాప్రభు సందేశమును బోధించుటకు కావలసిన దయ మరియు దృష్టి ఆయనకు మాత్రమే ఉన్నది. కృష్ణుని ఆంతరంగిక భక్తులలో అత్యంత ఉన్నతులులో వారు మాత్రమే అటువంటి అసాధారణ కార్యాలు చేయగలరు. శ్రీల ప్రభుపాద, ఆయన యొక్క అసాధారణ విజయాలు నుండి, వైష్ణవ సాంప్రదాయ చరిత్రలో విశిష్ఠ స్థానాన్ని పొందియున్నారు అనేది స్పష్టం అవుతుంది.
ఈ ఆధునిక యుగంలో ఒక ఆచారణాత్మకమైన మరియు పారదర్శక మార్గంలో కృష్ణ చైతన్యాన్ని వ్యాప్తిచేయుటకు శ్రీల ప్రభుపాద శక్తిమంతులైనారు. కృష్ణ చైతన్య బోధనలో ఏ మాత్రం కొంచెం కూడా రాజీపడకుండా, జ్ఞానహీనుడకు మరియు విద్వాంసుడకు ఇద్దరికీ సరియైన మరియు స్పష్టమైన రీతిలో తత్త్వాన్ని పదిలపరిచారు.
శ్రీల ప్రభుపాద ఇస్కాన్ ఎదుగుదలను వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. పుస్తక ముద్రణ మరియు వితరణ, హరినామ సంకీర్తన, మందిరాలు మరియు ఆశ్రమాలు, ప్రసాద వితరణ, ఆధ్యాత్మిక వ్యవసాయ సంఘాలు, గురుకులాలు, శాస్త్రవేత్తలు మరియు విద్వాంసులకు ప్రచారం వంటి ఇస్కాన్ విస్తరణలను వ్యక్తిగతంగా రూపొందించారు.
కృష్ణ చైతన్య మందలి సాధన, ప్రచారం, శ్రీవిగ్రహారాధన, భోగ తయారీ, మంత్రోచ్ఛారణ వంటి అన్నీ అంశములకూ శ్రీల ప్రభుపాద సమగ్రమైన మార్గనిర్దేశకాలు ఇచ్చారు. ధోతి ఎలా కట్టుకోవాలి వంటి అంశాలను కూడా ప్రదర్శించారు.
ఆ విధంగా శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. ఇస్కాన్ నందు గల ప్రమాణాలు మరియు సూచనలు ఏవైనా ఆయన నుండే వచ్చాయి. అందువలన శ్రీల ప్రభుపాద ఇస్కాన్ యొక్క ప్రధాన శిక్షా గురువు మరియు ఆచార్యునిగా ఎల్లప్పుడూ నిలుచును.
శ్రీల ప్రభుపాద తన గురువు మరియు పరంపర ఆచార్యులను విశ్వాసంతో అనుసరిస్తారని తెలియడం వలన, కృష్ణ చైతన్యంలో పెక్కు శాస్త్రాలు మరియు ఆచారాలు ఉన్నా, ఆధునిక యుగానికి తగిన రీతిన శ్రీల ప్రభుపాదులచే తెలుపబడిన విధంగానే ఆయన అనుచరులు కృష్ణ చైతన్యాన్ని పాటిస్తారు. శ్రీల ప్రభుపాదుల విజయం ఆయన దేవాదిదేవుడు కృష్ణునిచే ఆజ్ఞాపింబడి మరియు ఆశీర్వదింపబడి శ్రమించబడుట వలన కలిగినది అనేది అవగతమవుతుంది.
దీక్ష తీసుకున్న భక్తులు నిర్మాలిన్యమైన శుద్ధ భక్తులుగా అవ్వాలని కోరుకుంటే శ్రీల ప్రభుపాద వారి కోసం ఖచ్చితంగా పాటించవలసిన సూచనలు ఇచ్చారు. ఉదాహరణకు, దీక్ష తీసుకున్న భక్తులు ఉదయం 4 గంటలకే నిద్ర నుండి మేల్కొని మంగళ ఆరతికి హాజరు కావాలని, ప్రతి రోజు 16 మాలల మహా మంత్ర జపం కనీసం చేయాలని, నాలుగు నియమాలను తప్పకుండ పాటించాలని ఆజ్ఞాపించారు.
శ్రీల ప్రభుపాద స్పష్టంగా నిర్వచించిన ఈ అన్నీ ప్రమాణాలు ఇస్క్కాన్ నందు పాటించవలెను. సరియైన విధంగా నిలుచున్న, శ్రీల ప్రభుపాద యొక్క విజయవంతమైన అనుచరుడు విశ్వాసము గల ప్రామాణిక బంట్రోతు మాత్రమే. అతను శ్రీల ప్రభుపాద ఇచ్చిన ప్రమాణాలను మార్చడానికి లేదా ఊహించడానికి ప్రయత్నించడు. ఎందుకనగా, సమస్త మానవాళి పునర్ ఆధ్యాత్మీకరణకు ఇప్పటికే కాదు వచ్చే పది వేల సంవత్సరాలకు పూర్తి పరిపూర్ణమైన విధానాన్ని ఆయన ఇచ్చారని తెలియడం వలన.
ప్రతి రోజు శ్రీల ప్రభుపాదులను ఆరాధించవచ్చు, సమయం కుదరకపోతే కనీసం వారాంతాలలో ఆరాధించాలి. ఆయన ఫోటోను లేదా మూర్తిని ఒక ప్రత్యేక ఆసనం(వ్యాసాశన) నందు వుంచి గురు పూజ కీర్తన పాడుతూ ఆరతిని ఇవ్వాలి. ఒక చిన్న పీట మీద ఆకర్షణీయమైన వస్త్రం వేసి కూడా వ్యాసాశనం ఏర్పాటుచేయవచ్చు.