శ్రీ వైష్ణవ ప్రణామము

వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ

పతీతానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః 

ఎల్లరి కోరికలను తీర్చునట్టి కల్పవృక్షముల వంటివారు, పతిత బద్ధ జీవుల యెడ పూర్ణ కరుణను కలిగినవారును అగు వైష్ణవులందరకు నా గౌరవపూర్వక వందనములు.

కృష్ణ చైతన్యమందు భక్తులకు వందనములు అర్పించుట ముఖ్యం. ఎందుకనగా అది త్వరిత పురోగతికి దోహదపడుతుంది, మరియు భక్తులు మధ్య ప్రేమపూర్వక సంబంధములను ఏర్పరిచి నిలబెడతాయి.

గురువు వచ్చేప్పుడు మరియు వెడలినప్పుడు తప్పకుండ ప్రణామం చేయాలి. గురువుకు ప్రణామములు ఆయన నామమును తెలుపు ప్రణామ మంత్రం చెప్తూ అర్పించాలి.

ఒక సన్న్యాసికి కనీసం ఒకసారి  రోజులో మొదట సారి చూసినప్పుడు వందనములు చేయాలి. భక్తులందరికి ఒక్కొకరికి , ప్రత్యేకించి ఉన్నత భక్తులకు వారిని రోజులో మొదటి సారి చూసినప్పుడు, వందనములు అర్పించుట మంచి ప్రవర్తన.

సాధారణంగా వందనములు అర్పించగానే, ఆ భక్తుడు తిరిగి వందనములు అర్పించును. సంఘంలోని ఉన్నత భక్తుడు కనిష్ఠ భక్తునికి తిరిగి వందనం చేయకపోవచ్చు. దానికి బదులు వారికి ఉన్నత భక్తులు తమ ఆశీర్వాదములను ఇచ్చి, వారి  ఆధ్యాత్మిక పురోగతి కొరకు  అభిలాషించవచ్చు.  ఇది ప్రధానంగా సన్న్యాసులు మరియు దీక్ష గురువులు అనుసరిస్తారు.

ఒకవేళ ఒకరు ఒక వైష్ణవునితో అసంబద్ధంగా మాట్లాడినా,  ప్రవర్తించినా, అది ఎరుకకు రాగానే వెంటనే ఆ వైష్ణవునికి ప్రణామం చేసి  క్షమించమని అభ్యర్థించవలెను.