మంగళ ఆరతి
మంగళ ఆరతి
(1) సంసారదావానలలీఢలోక-
త్రాణాయ కారుణ్యఘనాఘనత్వమ్
ప్రాప్తస్య కల్యాణగుణార్ణవస్య
వందే గురోః శ్రీచరణారవిందమ్
(2) మహాప్రభోః కీర్తననృత్యగీత-
వాదిత్రమద్యన్మనసో రసేన
రోమాంచకంపాశ్రుతరంగభాజో
వందే గురోః శ్రీచరణారవిందమ్
(3) శ్రీవిగ్రహారాధననిత్యనానా-
శృంగారతన్మన్దిరమార్జనాదౌ
యుక్తస్య భక్తాంశ్చ నియుంజతోఽపి
వందే గురోః శ్రీచరణారవిందమ్
(4) చతుర్విధ శ్రీభగవత్ ప్రసాద-
స్వాద్వన్నతృప్తాన్ హరిభక్తసంఘాన్
కృత్వైవ తృప్తిం భజతః సదైవ
వందే గురోః శ్రీచరణారవిందమ్
(5) శ్రీరాధికామాధవయోరపార-
మాధుర్యలీలాగుణరూపనామ్నామ్
ప్రతిక్షణాస్వాదనలోలుపస్య
వందే గురోః శ్రీచరణారవిందమ్
(6) నికుంజయూనో రతికేళిసిద్ధ్యై
యా యాలిభిర్యుక్తిరపేక్షణీయా
తత్రాతిదాక్ష్యాదతివల్లభస్య
వందే గురోః శ్రీచరణారవిందమ్
(7) సాక్షాద్ధరిత్వేన సమస్తశాస్త్రై-
రుక్తస్తథా భావ్యత ఏవ సద్భిః
కింతు ప్రభోర్యః ప్రియ ఏవ తస్య
వందే గురోః శ్రీచరణారవిందమ్
(8)యస్య ప్రసాదాద్ భగవత్ప్రసాదో
యస్యాప్రసాదాన్న గతిః కుతోఽపి
ధ్యాయన్ స్తువంస్తస్య యశస్త్రిసన్ధ్యం
వందే గురోః శ్రీచరణారవిందమ్
శ్రీ గురుదేవులు కరుణాసాగరము నుండి వరములను పొందుచున్నారు. మేఘము వర్షించి కార్చిచ్చును ఆర్పునట్లుగానే శ్రీ గురుదేవులు సంసార మనెడు కార్చిచ్చును ఆర్పి భౌతిక దుఃఖములతో బాధపడుచున్న జగత్తును విముక్తి గావించుచున్నారు. అటువంటి కళ్యాణగుణసాగరుడైన శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.
భగవంతుని దివ్యనామాలను కీర్తిస్తూ, ఆనంద పారవశ్యముతో నృత్యము చేస్తూ, గీతాలను పాడుతూ, సంగీత వాయిద్యములను మ్రోగిస్తూ శ్రీ గురుదేవులు ఎల్లప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క సంకీర్తనోద్యమము పట్ల హర్షాతిరేకముతో ఉందురు. వారు తమ హృదయము నందు విశుద్ధ భక్తిరసాలను ఆస్వాదించుటచేత అప్పుడప్పుడు వారి రోమములు నిక్కబొడుచును, శరీరము కంపించును మరియు నేత్రముల నుండి అశ్రుధారలు ప్రవహించును. అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.
శ్రీ గురుదేవులు మందిరములో నిత్యము శ్రీ శ్రీ రాధాకృష్ణుల ఆరాధనలో నిమగ్ను లై ఉందురు మరియు అతడు వారి శిష్యులను కూడా అటువంటి ఆరాధనలో నిమగ్నులను చేయును. వారు అందమైన వస్త్రాలతో ఆభరణాలతో శ్రీ మూర్తులను అలంకరించుదురు, మందిరమును పరిశుభ్ర పరుచుదురు. ఈ విధముగా శ్రీ కృష్ణుని వారు వివిధ రకములగా ఆరాధించుదురు. అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.
శ్రీ గురుదేవులు, సదా శ్రీ కృష్ణునికి నాలుగు రకాలైన (చీకబడేవి, చప్పరింపబడేవి, త్రాగబడేవి మరియు పీల్చబడేవి) రుచికరమైన ఆహార పదార్థములను అర్పించుదురు. భక్తులు భగవత్ ప్రసాదమును గ్రహించి తృప్తి చెందినప్పుడు శ్రీ గురుదేవులు సంతృప్తి చెందుదురు. అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.
శ్రీ గురుదేవులు, శ్రీ శ్రీ రాధామాధవుల యొక్క అనంత గుణ, నామ, రూప మరియు మధుర లీలలను వినుటకు లేదా కీర్తించుటకు ఎల్లపుడు ఉత్సాహముతో ఉందురు. వారు ప్రతిక్షణము వీటిని ఆస్వాదించాలనీ ఆకాంక్షిస్తుందురు. అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.
శ్రీ గురుదేవులు వృందావన కుంజములలో శ్రీ శ్రీ రాధాకృష్ణుల మాధుర్య లీలల పరిపూర్ణతకు వివిధ ఏర్పాట్లు చేయు గోపికలకు సహాయము చేయుటలో నిపుణులగుట వలన , వారు రాధాకృష్ణులకు అత్యంత ప్రీతిపాత్రులు. అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.
శ్రీ గురుదేవులు భగవంతునికి పరమ ఆంతరంగిక సేవకులగుటచేత , వారిని భగవంతుని వలెనే గౌరవించవలెను. ఈ విషయాన్ని సకల శాస్త్రములు మరియు ప్రామాణిక సాధువులందరూ కూడా ధ్రువీకరించారు. అటువంటి శ్రీ హరి ప్రామాణిక ప్రతినిధియైన శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.
శ్రీ గురుదేవులు కృప వలన శ్రీ కృష్ణ భగవానుని కృపను పొందగలము. వారి కృప లేకుండా ఎవరు భక్తిమార్గమున ప్రగతిని సాధించలేరు. కాబట్టి త్రిసంధ్యలలో (ఉదయము, మధ్యాహ్నము, సూర్యాస్తమయము) శ్రీ గురుదేవులను స్మరిస్తూ స్తుతించవలెను. అటువంటి శ్రీ గురుదేవుని పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములు.
ఎవరైతే బ్రహ్మముహూర్త సమయాన గురుదేవుని ఉద్దేశించి ఈ సుందరమైన ప్రార్థనను అత్యంత శ్రద్ధతో గొంతెత్తి స్తుతిస్తారో వారు మరణాంతరము వృందవనేశ్వరుడైన శ్రీ కృష్ణునికి స్వయముగా సేవ చేసే భాగ్యాన్ని పొందుతారు.
మంగళ ఆరతి ఏ విధంగా చెయ్యాలి?
చెక్క లేదా ఏదేని ఇతర పదార్ధంలో తయారు చేసిన మెట్ల మాదిరి ఉన్న పీఠం ఉత్తమం. అన్నీ ప్రతిమలు పెట్టుటకు సరిపడా స్థలం ఉండేట్లు చూసుకోవాలి. పీఠానికి ఎదురుగా నిలబడిన వ్యక్తి ఎడమ వైపుగా పీఠానికి ఎదురుగా మూడు అడుగుల ఎత్తులో ఒక చిన్న పీఠను ఆరతి పళ్ళెం పెట్టుటకు ఉంచాలి. ఒక అడుగు ఎత్తు గల వేరే పీటను భోగ నివేదన కొరకు ఉంచాలి. కూర్చొనుటకు లేదా నిలుచుటకు ఒక చాప కూడా అవసరం.
ఇంటి యందు పూజా పీఠం నందలి ప్రతిమలు:
అన్నిటికి కంటే పైన నున్న మెట్టు మీద రాధా కృష్ణులు
రెండవ మెట్టు మీద పంచతత్త్వ మరియు నరసింహ దేవుడు
సంప్రదాయ ఆచార్యులు దిగువ మెట్టు యందు: a. శ్రీల ఏ. సి. భక్తి వేదాంత స్వామి ప్రభుపాద b. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరా c. గౌర కిశోర దాస బాబాజీ d. భక్తివినోద ఠాకూరా e. శ్రీల జగన్నాథ దశ బాబాజీ f. వృందావన వాసులైన షట్గోస్వాములు
ఉన్నత స్థాయి వారి ప్రతిమలకు పైన వారిని ఆరాధించు వారి ప్రతిమలు ఉంచరాదు. ఉదాహరణకు గురు ప్రతిమను శ్రీ కృష్ణునికి పైన ఉండునట్లు పెట్టరాదు. పంచతత్త్వ రాధా కృష్ణులను పూజిస్తారు మరియు పంచతత్త్వ సంప్రదాయ ఆచార్యులచే పూజింపబడుదురు.
ఆరతి కొరకు ఉంచిన ప్రత్యేకమైన ప్లేటు నందు ఈ క్రింది తెలిపిన పూజాద్రవ్యాలు ఉంచండి:
ఒక పెద్ద శంఖము (పూరించడానికి)
ఆచమన కొరకు ఒక పాత్ర మరియు చెంచా (శుద్ధీకరణకు)
అగరబత్తి ( కనీసం మూడు)
నేతి దీపం (5 ఒత్తులు)
చిన్న శంఖం మరియు దాని కొరకు స్టాండు (అర్ఘ్యం అర్పించుటకు)
అర్పించే నీటిని ఉంచుటకు చిన్న పాత్ర
వస్త్రంతో చేసిన చేతిరుమాలు
పుష్పాల ఉంచిన చిన్న పళ్ళెం
అగ్గిపెట్టె లేదా లైటరు
వింజామర మరియు చామర
గంట
ఆచమనము
ఆరతికి ముందు వందనములు అర్పించాలి. ఆ తరువాత ఆచమనము చేయాలి.
ఆచమన పాత్ర నందలి స్పూన్ తో నీరు తీసుకుని, రెండు చేతులను శుద్ధి చేసుకోండీ.
ఒక స్పూన్ నిండుగా నీరు కుడి చేతిలో తీసుకుని, "ఓం కేశవాయ నమః" అని ఉచ్చరిస్తూ ఆ నీటిని త్రాగండి.
ఒక స్పూన్ నిండుగా నీరు కుడి చేతిలో తీసుకుని, "ఓం నారాయణ నమః" అని ఉచ్చరిస్తూ ఆ నీటిని త్రాగండి.
ఒక స్పూన్ నిండుగా నీరు కుడి చేతిలో తీసుకుని, "ఓం మాధవాయ నమః" అని ఉచ్చరిస్తూ ఆ నీటిని త్రాగండి.
ఆరతి పూర్తి అయ్యే వరకు చేతులను శుద్ధి చేసుకొనుటకు ఆచమన పాత్ర ఉపయోగించవలసి ఉంటుంది. ఏదేని పూజా ద్రవ్యం శుద్ధి చేయుటకు మూడు చుక్కల నీటి చిలకరించండి. ప్రతి పూజా ద్రవ్యం అర్పించే ముందు మీ చేతిని మూడు చుక్కల నీటితో శుద్ధి చేసుకోండీ.
ఆచమన తరువాత, పూరించే శంఖమును శుద్ధి చేసుకుని, మీ కుడి చేతిలోకి తీసుకుని మూడు సార్లు పూరించండి. శంఖమును మళ్ళీ శుద్ధి చేయండి. మీ కుడి చేతిని శుద్ధి చేసుకోండీ. గంట మ్రోగిస్తూ తెర తీయండి. మిగిలిన భక్తులు భగవంతుని చూడగానే వందనములు అర్పించాలి. నిల్చుని కీర్తన మొదలు పెట్టాలి.
ఆరతి పళ్ళెంను చిన్న పీటపై ఉంచాలి. ఇప్పుడు అగరబత్తిని శుద్ధి చేసి వెలిగించాలి. ఒక నునె దీపం లేదా క్రోవ్వత్తి ఉండడం మేలు. అవి లేని సమయంలో అగ్గిపెట్టే వాడి అగరబత్తిని వెలిగించండి.
రెండు చేతులు మరియు గంట శుద్ధి చేసుకోండి. అగరబత్తిని కుడి చేతిలో తీసుకుని, గంటను ఎడమ చేతిలో తీసుకుని, గంటను మ్రోగిస్తూ ఆరతి ఆరంభించండి. ప్రతి పూజాద్రవ్యాన్ని నడుమకు పైకి వుంచి అర్పించాలి.
పంచరాత్ర ప్రదీప, ఇస్కాన్ శ్రీ విగ్రహ పూజా పుస్తకం ఈ క్రింది రీతిని ఆమోదిస్తుంది.
మొదటగా స్వల్ప సమయం ప్రతి పూజా ద్రవ్యం గురువునకు, వారి గురువునలు ఆ విధంగా పరంపర గురువులందరికి చూపించాలి. కృష్ణునికి నేరుగా అర్పించరాదు అనేది ఇక్కడ నియమం. అందువలన మొదటగా మీ గురువు చెంతకు, ఆ గురువు తన గురువు చెంతకు తీసుకెళ్ళును.ఆ విధంగా ప్రతి గురువు ఆజ్ఞ తీసుకుని, కృష్ణుని చెంతకు ఆ ద్రవ్యాని తీసుకెళ్లి వలయాకారంలో త్రిప్పుతూ మొదటగా పాదాలకు అర్పించి, క్రమంగా తల వరకు తీసుకువచ్చి, మొత్తానికి అర్పించాలి.ఆ టర్వూయత రాధారాణిని అర్చించాలి, అటు పిమ్మట శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీ నిత్యానంద, చివరగా పరంపర గురువులు (ఉన్నత గురువు నుండి మీ గురువు వరకు). రాధారాణికి కృష్ణునికి అర్పించిన దానిని, శ్రీ చైతన్య మహాప్రభువుకి రాధారాణికి అర్పించినది, ఆ విధంగా అర్చిస్తాము. కొన్ని పద్దతుల యందు నియమిత సంఖ్యతో వలయకారములో అర్పిస్తూ పూజించాలి అని పేర్కొనబడుతుంది. అది మంచిదే కానీ వలయాలను లెక్కించుట కంటే భగవంతుని సేవకు అంకితం అవ్వటం ముఖ్యం.
పూజా ద్రవ్యాలు అర్పించు క్రమము:
అగరబత్తి
నేతి దీపం
అర్ఘ్యం
వస్త్రం
పుష్పాలు
చామర
వింజామర (వేసవి కాలమందు మాత్రమే)
పూజా ద్రవ్యాలు చుట్టూతా తిప్పు విధానం:
అగరబత్తి: చుట్టూరా ఏడు సార్లు
నేతి దీపం: పాదాలకు నాలుగు సార్లు, మధ్య భాగాన రెండు సార్లు, తలకు మూడు సార్లు, మొత్తం చుట్టూతా ఏడు సార్లు
అర్ఘ్యం: తలకు మూడు సార్లు, మొత్తం చుట్టూతా ఏడు సార్లు
వస్త్రం: చుట్టూరా ఏడు సార్లు
పుష్పాలు: చుట్టూరా ఏడు సార్లు
చామర: చుట్టూరా ఏడు సార్లు
వింజామర: చుట్టూరా ఏడు సార్లు (వేసవి కాలమందు మాత్రమే)
ఈ విధంగా అర్పించిన తరువాత, తులసి దేవికి, గురు పరంపరకు, అక్కడ ఉన్న వైష్ణవులకు మూడు సార్లు చుట్టూతా త్రిప్పుతూ అర్పించాలి.
శంఖంతో నీటిని అర్పించేప్పుడు, ప్రతి అర్చా మూర్తికి అర్పించిన తరువాత ప్రత్యేకంగా వుంచిన పంత్రలో మూడు చుక్కలు వేయాలి. అందరూ అర్చ మూర్తులకు అర్పించిన తరువాత మిగిలిన నీటిని కూడా ఆ పాత్ర యందు ఉంచాలి. పుష్పాలు అర్పించిన తరువాత, ఒకటి లేదా అంతకు మించి మీరు పూజించిన మూర్తుల పాదాల చెంత ఉంచాలి.
శీతాకాలం అందు, ఫ్యాన్ అర్పించవద్దు. ప్రతి ద్రవ్యం అర్పించే ముందు, అర్పించిన తరువాత శుద్ధి చేయడం గుర్తు పెట్టుకోండి.
ఇరవై నిమిషాలలో ఆరతి ముగించాలి. మూడు సార్లు శంఖం పూరించి ముగింపును తెలియచేయాలి. శంఖంను మూడు చుక్కల నీటితో శుద్ధి చేసిన తరువాత, ఆరతి సమయంలో అర్పించిన నీటిని కుడి చేతిలో తీసుకుని భగవంతుని గది ముందు నుండి భక్తుల తలపై చల్లాలి. ఆ తరువాత అర్పించిన పుష్పాలు కొన్నిటిని భక్తులకు పంచాలి. ఆరతి పళ్ళెం శుభ్రం చేయుటకు తీసుకెళ్లాలి. అప్పుడు భక్తులు కీర్తన ఆపాలి.
సమయమునకు అనుగుణంగా కీర్తనలో పాడు వివిధ పాటలు:
శ్రీ శ్రీ గురువాష్టకం (మంగళ ఆరతి ఆరంభంలో)
శ్రీ నరసింహ ప్రణామ ( మంగళ ఆరతి ఆఖరులో)
శ్రీ తులసి కీర్తన (తులసి ఆరతికి, మంగళ ఆరతి తరువాత)
శ్రీ గురు వందనము (శ్రీల ప్రభుపాద గురు పూజ)
జయ రాధా మాధవ (క్లాసుకు మునుపు)
ప్రసాద సేవయ (ప్రసాదం స్వీకరించు ముందు)
గౌర ఆరతి (సాయంత్రం)
మంగళ ఆరతి పాటలు, తులసి పూజ, గురు పూజ మరియు సంధ్యా ఆరతి పూర్తి అయిన పిమ్మట, శ్రీల ప్రభుపాద ప్రణామ మంత్ర, పంచ తత్త్వ మంత్ర మూడు సార్లు కీర్తన కొనసాగించి హరే కృష్ణ మాహా మంత్రతో ఆరతి ముగించండి.
షట్ గోస్వాములు
శ్రీల జగన్నాథ దశ బాబాజీ
శ్రీల భక్తివినోద ఠాకూరా
గౌర కిశోర దాస బాబాజీ
శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరా
శ్రీల ఏ. సి. భక్తి వేదాంత స్వామి ప్రభుపాద