తిలకధారణ
తిలకధారణ
ఓం కేశవాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూధనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
నుదుటి మీద తిలక ధారణకు మనం గోపిచందనం ఎందుకు ఉపయోగిస్తామో తెలుసునా? ఇది భారతదేశంలో ఏ ప్రాంతం నుండి వస్తుందో తెలుసా? గోపిచందనం యొక్క 'మూలం' వెనుక శ్రీ కృష్ణుని ఒక అద్భుతమైన లీల ఉన్నది.
ఒకసారి గొప్ప భక్తుడైన శ్రీ నారద ముని, శ్రీ కృష్ణుని యొక్క అతి గొప్ప భక్తుడు ఎవరో తెలుసుకోవాలని కోరిక కలిగినది. ఆయన ఆలోచించినా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతారు. అందువలన శ్రీ కృష్ణుని వద్దకు ఈ ప్రశ్నతో వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. శ్రీ నారద ముని భగవంతుని యొక్క మొత్తం సృష్టిలో ఎక్కడికైనా ప్రయాణించగల వరం కలిగి ఉన్నాడు. ఈ విశ్వంలో ప్రయాణించునపుడు తన వీణ వాయిస్తూ మరియు తియ్యని గాత్రంతో "జయ శ్రీ రాధిక రమణ శ్రీ రాధిక రమణ" అని జపిస్తాడు.
శ్రీ నారదుడు చివరికి భగవంతుని నివాస భవనానికి చేరి ఆయన దర్శనం కోసం లోపలకి వెళతాడు. భగవంతుడు ఒక మంచంపై పడుకుని, తన తలపై చేయి పెట్టుకుని ఉండడం చూస్తాడు. శ్రీ నారదుడు భగవంతునికి తన ప్రణామములు అర్పించి, "ఓ ప్రభు! ఏమి అయినది? మీరు కుశలమేనా?" అని అడిగెను.
భగవంతుడు అతని వైపు చూసి ఇట్లు చెప్పెను, "ఓ నా ప్రియ నారదా! నాకు చాలా తీవ్రమైన తలనొప్పిగా ఉన్నది."
"తలనొప్పా!" అని నారద ముని కొంచెం ఆశ్చర్యపడెను. అతను ఇట్లు అడిగెను, "నా ప్రభూ, మీ తలకు మర్దన చేయనివ్వండి"
"వద్దు, ధన్యవాదములు నారదా. ఈ తలనొప్పి అంత సులభంగా పోదు. నా భక్తుల్లో ఒకరు వారి పాదదూళిని ఇస్తే, అది నా తల మీద రాస్తే తప్ప ఈ నొప్పి పోదు." అని శ్రీ కృష్ణ భగవానుడు చెప్పెను.
నారదుడు: "భక్తుల పాదధూళి!"
"అవును నారదా, నీవు వెళ్ళి నా భక్తులలో ఒకరి నుండి కొంచెం పాదధూళి తీసుకురాగలవా?"
నారదుడు: "సరే స్వామి. కానీ ఇక్కడికి నేను ఒక ప్రశ్న అడగడానికి వచ్చాను..."
"నీ ప్రశ్నకు సమాధానం తర్వాత చెప్తాను. దయచేసి మొదట వెళ్ళి నా తల నొప్పి పోగొట్టడానికి సహాయము చేయుము."
"అలాగే అలాగే. మీ ఆజ్ఞ, నేను ఇప్పుడే వెళ్ళి కొంచెం ధూళి తీసుకువస్తా." అని చెప్పి, భక్తులలో ఒకరి పాదధూళి తెచ్చుటకు నారదుడు భగవంతుని భవంతి నుంచి వెడెలెను. ఎవరు పాదధూళి ఇవ్వడానికి అంగీకరిస్తారా అని అతను ఆశ్చర్యపోవుచుండెను. తన మార్గంలో, కొందరు బ్రాహ్మణులు ఒక మందిరంలో గొప్ప భక్తితో శ్రీ కృష్ణున్ని పూజించడం అతను చూసెను. నారద మునిని చూసి వారు ఇట్లు అడిగెను, "ఓ నారద ముని, మా ప్రియ కృష్ణ భగవానుడు ఈరోజు ఎట్లుండెను?"
"ఓ! ఆయన బాగానే ఉన్నారు... కానీ ఈరోజు తీవ్రమైన తలనొప్పితో ఉన్నారు" అని నారదుడు సమాధానమిచ్చెను.
"తలనొప్పా!" అని ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపడెను. "కొన్ని యజ్ఞాలు మరియు కీర్తనలు చేద్దాం. భగవంతుని తలనొప్పి నుండి స్వాంతన పొందుటకు కటినమైన తపస్సులలో నిమగ్నమగుదాము."
"ఇవి ఆయన తలనొప్పి తగ్గించవు." అని నారదుడు చెప్పెను. "మీరు కనుక కొంచెం మీ పాదధూళి ఇస్తే, ఆ భగవంతుడు తన తలకు అది రాసుకోవడం వలన ఆయన తలనొప్పి తగ్గుతుంది."
"మా పాదధూళి యా!" అని ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపడెను. "నారదుడు గారు, మీకు ఏమైనా పిచ్చిపట్టినదా? మేము ఒక ఘోర పాపమునకు ఒడికొట్టి, నరకానికి వెళ్లాలా? కాదు! కాదు! మేము ఇది చెయ్యలేము."
ఇది విని నారద ముని అక్కడ నుండి వెడెలెను. దారిలో ఐదుగురు పాండవ సోదరులు కనిపిస్తారు. వారు కృష్ణుని ఆంతరంగిక స్నేహితులు మరియు గొప్ప భక్తులు. అందువలన నారద ముని వారి చెంతకు వెళ్ళి, వారి పాదధూళి కొంచెం కోరెను. పాండవులు నారద ముని అడిగిన దానికి ఆశ్చర్యపడెను. వారంతా దానికి అంగీకరించలేదు. అర్జునుడు కూడా అంగీకరించలేదు.
పాండవులు చెప్పెను, "శ్రీ కృష్ణుడు దేవాదిదేవుడు అని మీకు తెలియదా? చాలా దయతో ఆయన మమల్ని తన స్నేహితులుగా ఆదరిస్తారు, ఆయన దేవాదిదేవుడు భగవంతుడు తప్ప వేరే కాదు. మేము ఇలాంటి పాపాన్ని ఎలా చేయగలం? కాదు, కాదు, దయచేసి మమల్ని క్షమించండి."
పాండవులచే తిరస్కరించబడుటచే, శ్రీల నారద ముని ఎవరైనా భక్తుడి ధూళి కోసం వెతకడం ఆరంభించెను. ద్వారకలోకి వెళ్ళగానే ఉద్ధవుడు మరియు అక్రూరుడును కలిసెను. కృష్ణునికి ఉద్ధవుడు చాలా చాలా ఆంతరంగిక స్నేహితుడు మరియు అక్రూరుడు మేనమామ. వారు నారద మునిని చూడగానే, ఆయనకు నమస్కారించెను. శ్రీల నారద ముని వారిని ఆశీర్వదించి, భగవంతుని తలనొప్పి గురించి చెప్పి, వారి పాదధూళిని ఇవ్వమని కోరెను. అయినప్పటికి వారిద్దరూ మర్యాదపూర్వకంగా తిరస్కరించెను.
శ్రీల నారద ముని అప్పుడు ద్వారకలోని కృష్ణ భగవానుని రాణుల వద్దకు వెళ్ళేను. కృష్ణునికి 16108 మంది రాణులు కలరు. వారు శ్రీల నారద మునికి నమస్కరించి, కూర్చొనుటకు ఆసనం ఏర్పాటుచేసెను. భగవంతుని తలనొప్పి గురించి చెప్పగానే, వారు కలత చెందెను. రుక్మిణీ దేవి రోధించెను. "ఓ! నా ప్రభువుకు ఏమైనది? ఆయనకు తలనొప్పి ఎట్లు వచ్చెను?"
శ్రీల నారద ముని చెప్పెను, "అది నాకు తెలియదు, కానీ ఎలా నయం అవుతుందో మాత్రం నాకు తెలుసు."
రాణులంతా ఒక్కసారిగా "ఎలా?" అని ప్రశ్నించేను.
"మీరు కనుక కొంచెం మీ పాదధూళి ఇస్తే, ఆ భగవంతుడు తన తలకు అది రాసుకోవడం వలన ఆయన తలనొప్పి తగ్గుతుంది." అని నారదుడు చెప్పెను.
"మా పాదధూళి యా!" అని రాణులంతా ఆశ్చర్యపడెను.
"అవును, కొంచెం మీ పాదధూళి," అని నారదుడు చెప్పెను.
"కాదు నారదుడు గారు, మేము ఇది ఎలా చేయగలం? శ్రీ కృష్ణ భగవానుడు మా భర్త, మేము ఆయన యొక్క పవిత్రమైన భార్యలము. మేము ఎలాంటిది ఎలా చేయగలం? "
"కానీ ఇది భగవంతుడి ఇచ్ఛ" అని నారదుడు అభ్యర్థించెను.
"ఏమైనా కానీ, మేము ఈ మహాపరాధానికి పాల్పడలేము." అని చెప్తూ రాణులు అక్కడ నుండి వెడలెను.
నారద ముని ద్వారక విడిచి, వృందావనం వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బాల్యంలో కృష్ణుడు వృందావనంలో ఉండెను. వృందావన వాసులు కృష్ణుడిని చాలా ప్రేమిస్తారు. అందువలన శ్రీల నారద ముని తనకు అదృష్టం అక్కడ ఉంటుందని ఆశపడ్డాడు. అక్కడ కూడా విఫలమయ్యేను. ఇంచుమించు వృందావన వాసులంతా తమ పాదధూళి ఇచ్చుటకు తిరస్కరించారు. కృష్ణుని స్నేహితులైన గోపాలురు కూడా తిరస్కరించారు. వారంతా కృష్ణున్ని చాలా ప్రేమిస్తారు, వారు ఆయన తలనొప్పికి చాలా చింతించారు. వారు మంచి నూనెలతో మర్దనా చేయటం లేదా మరెదేమైనా చేయుటకు సిద్ధంగా వున్నారు తప్ప, పాదధూళి ఇచ్చుటకు తిరస్కరించారు.
శ్రీల నారద ముని ఇప్పుడు చాలా నిస్సహాయుడుగా భావించెను. ఆయన వృందావనం నుండి బయలుదేరే సమయాన ఒక కుంజకు (పూలతో నిండిన తోట) చేరెను. అక్కడ వేలాది గోపీలను చూసేను. వారంతా కృష్ణుని గురించి మాట్లాడుకుంటూ, ఆయన మధుర లీలలను గుర్తుచేసుకొనుచుండెను. కొన్నిసార్లు వారు నవ్వుచుండెను, కొన్నిసార్లు తమ ప్రియా కృష్ణుని గురించి ఆలోచిస్తూ ఏడుస్తుండేను.
నారదుడుని చూడగానే గోపికలు ఆయనకు నమస్కారించెను. వారు తమ ప్రియ కృష్ణుడు ఎలా ఉన్నారు అని ప్రశ్నించేను? శ్రీ నారద ముని భగవంతుని తలనొప్పి గురించి చెప్పెను. అది విని గోపికలు చాలా కలత చెంది, భగవంతుని తలనొప్పి తగ్గించుటకు ఏమి చేయవచ్చు అని ప్రశ్నించేను.
శ్రీల నారద ముని మౌనంగా ఉండెను. ఇప్పటి వరకు చాలా మంది భక్తులను కలిసేను, కానీ ప్రతి సారి తిరస్కరించబడెను. అందువలన ఈ సారి అంత ఆశ లేదు. అప్పుడు గోపికలు ఏమి చేయవచ్చు అని మళ్ళీ అడిగెను. కృష్ణుని తలనొప్పి తగ్గించుటకు వారు చాలా ఆత్రంగా ఉండెను. వారు ఆ విధంగా కొంచెం సేపు పట్టు పడితే, అప్పుడు నారద ముని చివరికి ఇలా చెప్పెను, "మీరు కనుక కొంచెం మీ పాదధూళి ఇస్తే, ఆ భగవంతుడు తన తలకు అది రాసుకోవడం వలన ఆయన తలనొప్పి తగ్గుతుంది".
"నిజంగా తలనొప్పి తగ్గుతుందా?" అని గోపికలు అడిగెను.
"అవును, తప్పకుండా తగిస్తుంది"
"మీరు నిజమే చెప్తున్నారా, నారదుడు గారు?"
"అవును, అదే నాకు భగవంతుడు చెప్పినది."
"సరే, యమునా తీరానికి వెళ్దాము. మేము అక్కడ మట్టి మీద నడుస్తాము. మీరు నింపగలిగినన్ని పెద్ద పెద్ద సంచులు నింపి, కృష్ణుని వద్దకు తీసుకెళ్ళండి."
ఇది విని శ్రీ నారద ముని చాలా ఆశ్చర్యపడెను. ఆయనకు నమ్మశక్యం కాదు. "మీరు నరకం వెళ్తారేమో అని భయం లేదా?" అని అడిగెను.
"ఎందుకు?"
"ఎందుకనగా... కృష్ణుడు దేవాదిదేవుడు. మీరు కృష్ణుడుచే మీ పాదధూళిని తన తలకు రాయనిస్తే, అప్పుడు మీరు ఆ పాపానికి నరకానికి వెళ్ళాలి" అని సమాధానమిచ్చేను.
"అంతేనా, మేము నరకానికి వెళ్లడాన్ని అంత పట్టించుకోము. కృష్ణుడు మా ప్రియుడు అనే మాకు తెలుసు. అతను మా ప్రాణం. ఆయన సంతోషానికి మేము ఏమైనా చేస్తాము. దాని వలన ఘోరమైన నరకాలకి వెళ్లాల్సివచ్చినా సరే."
వారికి శ్రీ కృష్ణుని పట్ల వారికి పవిత్రమైన మరియు చిత్తశుద్ధి గల భక్తికి, శ్రీల నారద ముని చాలా గాఢంగా ఆశ్చర్యపడెను. తన మనస్సులోనే వారికి దండవత్ ప్రణామములు చేసి, తను కూడా వారి లాంటి నిస్వార్థ భక్తి గల స్థితిని పొందేలా ఆశీర్వదింపబడాలి అని ప్రార్ధించేను.
"ఏమి ఆలోచిస్తున్నారు నారదుడు గారు?" అని గోపికలు అడిగెను. "పదండి తొందరగా. కృష్ణుడు చాలా నొప్పితో బాధపడుతున్నారేమో! దయచేసి వెంటనే పాదధూళిని తీసుకోండి."
ఆ విధంగా వారంతా యమునా తీరానికి వెళ్తారు. వేలాది గోపికలు కిలోమీటర్లు కొద్ది నడుస్తారు. అప్పుడు నారదుడు ఆ ధూళిని తీసుకుని, ద్వారకు వెళ్ళేను. ద్వారకాకు వెళ్ళగానే, కృష్ణున్ని చూడటానికి వెంటనే వెళ్ళేను. నిజానికి కృష్ణుడు ఎదురు చూస్తుండేను.
"కొంచెం ధూళిని తెచ్చావా, నారదుడు గారు?"
"అవును, ప్రభు" అని నారదుడు, ధూళిని తీసి, ఆయన తలకి రాస్తాడు. ఆయన వెంటనే చాలా సంతోషపడి, తృప్తి చెందెను.
"ఇంత ధూళిని ఎవరు ఇచ్చారు, నారదుడు గారు?" అని అడిగెను.
"గోపికలు, ప్రభు". అప్పుడు నారదుడు తన మొత్తం సాహసభరితమైన ప్రయాణం గురించి చెప్తాడు.
అది అంతా విని కృష్ణుడు చాలా తృప్తి చెందుతాడు. అప్పుడు ఇలా అడుగుతాడు, "నారదా, ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం వచ్చిందా?"
"అవును, ప్రభు." తన కళ్ళలో నీళ్ళతో, శ్రీ నారద ముని శ్రీ కృష్ణునికి నమస్కరించేను. ఆయన ఆ రోజు వృందావనం నుండి తీసుకు వచ్చిన మట్టిని తన శరీరం మీద "తిలకం" గా ఉపయోగిస్తారు, గోపికల దయ కోసం ప్రార్ధిస్తారు. ఈ విధంగా "గోపిచందనం" యొక్క ఉనికి వచ్చినది.