ఉల్లి వెల్లుల్లి ఆహారంగా తీసుకోవడం ఎందుకు మంచిది కాదు
ఉల్లి వెల్లుల్లి ఆహారంగా తీసుకోవడం ఎందుకు మంచిది కాదు
ఆయుర్వేదం ప్రకారం ఆహారం మూడు రకాలుగా ఉంటుంది - సాత్విక, రాజసిక, తామసిక. ఉల్లి వెల్లుల్లి, అల్లియం వృక్ష జాతికి చెందినవి, అనేవి రాజసిక ఆహారం, కొంత శాతం తామసిక ఆహారం కూడా. అంటే అవి రజోగుణమును పెంచుతుంది, కొంత శాతం తమొగుణమును కూడా పెంచుతుంది.
భారతదేశ బ్రాహ్మణ రీతిలో వంట చేసేవారు, వైష్ణవులు - విష్ణువు, రామ, కృష్ణ భక్తులు, సాత్త్విక రకమైన ఆహారపదార్ధాలను మాత్రమే వండటానికి ఇష్టపడతారు. ఈ ఆహారమేమనగా - తాజా ఫలాలు, కూరగాయలు, ఆకులు, పాల పదార్ధాలు, ధాన్యాలు, పప్పులు మొదలైనవి. రాజసిక, తామసిక ఆహారము శ్రీవిగ్రహానికి నివేదించడానికి అయోగ్యమైనవి కనుక ప్రత్యేకంగా వైష్ణవులు వాటిని వండరు.
రాజసిక, తామసిక ఆహారము మామూలు ఆరోగ్యం, ధ్యానం, మరియు భక్తికి హానికరం అవ్వడం వల్ల, వాటిని ఉపయోగించారు. వెల్లుల్లి ఒక సహజ రోగక్రిమి నాశనం చేయునది అయిననూ, అది కేంద్రీయ నాడీ వ్యవస్థను ప్రేరేరింపచేయడం వలన ధ్యానానమునకు ఆటంకం పరుస్తూండటం వలన అది కూడా ఉపయోగించరాదు.
అదే కారణం వలన, ధ్యానాన్ని ఆటంకపరుస్తుంది కనుక, ఖచ్చితమైన బౌద్ధులు కూడా అల్లియం జాతి ఆహారం తీసుకోరు. ప్రపంచంలో ఏదేని వీయత్నాం, చైనీస్, లేదా జపనీయులకు సంబంధించిన ఖచ్చితమైన శాకాహార హోటల్ కి వెళితే అల్లియం ఉన్న ఆహారం ఉండదు.
ఒక కారణం, ప్రాచీన బౌద్ధ గ్రంథాలలో ఒక సాధువు అల్లియంను ఐదు రకాల సుగంధం గల కూరగాయలుగా పేర్కొనేను. ఇవి ఒక్కొక్కటి ఒక్కో అవయవం, కాలేయం, ప్లీహం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, మరియు హృదయం, మీద చెడు ప్రభావం చూపుతాయట. ఆయన చెప్పిన ప్రకారం, వీటిలో ఉన్న ఐదు రకాల ఎంజైములు, ముఖ్యంగా పచ్చిగా తిన్నప్పుడు, శ్వాస, చెమట మరియు మలం ఒక రకమైన దుర్వాసనగా వస్తుంది, మరియు కోరికలు, ఉద్రిక్తలు, ఆతృత, కోపాలను పెంచుతుంది.
మను సంహిత:
5.5 : ఉల్లి, వెల్లుల్లి, పుట్టగొడుగులు మరియు అశుద్ధ పదార్ధముల నుండి మొలకెత్తునవి ద్విజులు భుజించుటకు అయోగ్యమైనవి.
5.19 : ఎవరేని ద్విజుడు ఎరుకతో పుట్టగొడుగులు, పంది, ఉల్లి, వెల్లుల్లి, కోడి తినునో, వారు వెలివేయబడును.
ఉల్లి, వెల్లుల్లి ఒక చనిపోయిన ఆవు శరీరం నుండి వచ్చినవి, అందువలన అవి మాంసాహారంతో సమానం.
ఈ కథనానికి శాస్త్ర ఆధారం తెలియదు. ఇవి శాస్త్ర ప్రకారం మాంస భక్షణ చేయరాదు అనే నియమాన్ని ఉల్లంగిస్తుంది. శుద్ధ శాకాహారులు ఉల్లి వెల్లుల్లి తినరు. ఎందుకనగా మాంసం అనేది తామసికాహారం. ఉల్లి వెల్లుల్లి కూడా తామసిక మరియు రాజసికమైనవే. అవి కొన్ని ఔషధ గుణాలను కలిగి ఉండవచ్చు, ఎలాగైతే ద్రాక్షమద్యం కొన్ని ఔషధాలలో ఉపయోగిస్తారో ఆ విధంగా. అవి వైదిక సంప్రదాయంలోని వారికి నిషిద్ధమైనవి.
"ఒకసారి సత్య యుగం నందు విశ్వశాంతి కోసం ఋషులు గోమేధ మరియు అశ్వమేధ యాగాలు చేసెను. ఒక ఆవు లేదా ఒక గుర్రం ముక్కలుగా చేయబడి అగ్నిలో అర్పింపబడతాయి. ఋషులు మంత్రాలు చదివినపుడు, అదే జీవి ఒక అందమైన యువ దేహంలో ప్రాణం పోసుకుంటుంది.
ఒకసారి గోమేధ యాగం చేయు ఋషి యొక్క భార్య గర్భం దాల్చి యుండెను. గర్భధారణ సమయంలో ఏదేని తినాలని కోరిక ఉండి, తినకపోతే, అప్పుడు పుట్టిన బిడ్డ ఎప్పుడూ చుంగ కారుస్తూంటారు. ఋషి భార్యకి మాంసం తినాలని కోరిక కలిగింది, అందువలన యాగంలో అర్పించిన ఒక మాంసపు ముక్కను తీసుకోవాలని నిర్ణయించుకుని, ఒక ముక్కను తీసుకుని దాచి, తొందరలో తినాలని పథకం వేసింది. అదే సమయాన ఋషి యాగం పూర్తి చేసి, ఒక కొత్త ఆవు దూడగా ప్రాణం పోయడానికి అన్నీ మంత్రాలు చదివెను. అయితే ఆ కొత్త ఆవుకు ఒక ఎడమ వైపు చిన్న భాగం లేదని గుర్తించెను. ఆయన ధ్యానం చేసి తన భార్య ఒక మాంసపు ముక్క తీసుకున్నట్లు తెలుసుకొనేను, ఆమెకు కూడా జరిగినది తెలిసి వెంటనే మాంసాన్ని దూరంగా పారవేసేను.
ఋషి మంత్ర ప్రభావము వలన ఆ పడవేసిన మాంసం ముక్కకు ఇప్పుడు ప్రాణం వచ్చెను. అప్పుడు ఆ మాంసపు రక్తం నుండి ఎర్ర పప్పు అయ్యేను, దాని ఎముకలు వెల్లుల్లి, మాంసం ఉల్లి అయ్యేను. అందువలన ఈ ఆహార పదార్ధాలు సత్త్వ గుణంలో గల ఏ వైష్ణవుడుతీసుకోడు. ఎందుకనగా ఇవి భగవంతునికి అర్పింపచేయడానికి ఉపయోగపడవు మరియు అవి తమో గుణంలోనివి. ఉల్లి వెల్లుల్లి అనేవి శాకాహారం కాదు. వీటిలో 21 రకాల మెల్లిగా విషంగా మారు పదార్ధాలు ఉండడం గుర్తించారు. అందువలన ఇవి అమాయకమైనవి కావు. "