భారత దేశం మరియు తూర్పు దేశాలలోని కోట్లాది మంది యొక్క జీవన శైలి అయిన శాకాహారము ఎనిమిదవ ప్రపంచ వింతగా పరిగణించబడి ఎంతో
కాలం గతించలేదు. అవగాహన లేని యువకులు శాకాహారము అనగానే ఒక పళ్ళెంలో వైవిధ్యం లేని ఉడికించిన బంగాళాదుంపలు మరియు బఠానీలను
మాత్రమే ఊహించేవారు. కానీ ప్రస్తుతం, ఆ ఆలోచనలన్నీ వివిధ రకాల మాంసములతో వండబడిన బర్గర్లు మరియు ఇతరత్రా తినుబండరాలకి
అలవాటుబడిన సమాజం యొక్క అపోహలు మాత్రమే అని గ్రహిస్తున్నారు. వాస్తవానికి శాకాహారము అనేది ఏమి వింత కాదు. సాధారణంగా 40
రకాలకు పైగా కూరగాయలు, 25 రకాల చిక్కులు మరియు బీన్స్, డజన్లకు పైగా పండ్లు, ధాన్యాలు, పాల పదార్ధములు లభ్యమగును.
ఎండిన చిక్కుడు లేదా బీన్స్ ను, మరియు వాటితో వండిన ఆహారమును సాధారణంగా పప్పు లేదా దాల్ అని పిలుస్తారు. పప్పు భారతీయుల అంతిమ
సౌకర్యవంతమైన ఆహారం. పప్పు చాలా రుచికరంగా ఉండి తేలికగా జీర్ణమగును. పప్పు ద్వారా ఐరన్, విటమిన్ - బి, మాంసకృత్తులు మన శరీరానికి
అందుతాయి. పప్పును బ్రెడ్, అన్నం, లేదా పాల పదార్ధములతో చేసిన వంటకాలతో కలిపి తింటే మాంసకృత్తులు 40% పెరుగుతాయి. వేరే విధంగా
చెప్పాలంటే, 3/4 కప్పు పప్పు మరియు 2 కప్పుల అన్నంతో తింటే లభ్యమయ్యే మాంసకృత్తులు , ఒక పావు కిలో మాంసంతో లభ్యమయ్యే
మాంసకృత్తులుతో సమమగును.
ఇంకా చెప్పాలంటే మాంసం బదులు పప్పు తినడం ద్వారా, మాంసం తినడం వల్ల వచ్చే కొలెస్టెరాల్ మరియు కాలరీలు గురించి చింతించనక్కరలేదు. పైగా
మీరు తినేది ఏ అభాగ్యమైన, కిక్కిరిసిన ప్రదేశంలో తొందగర మరియు ఎక్కువ బరువుగా ఉండటానికి అసాధారణ ఆహారం మరియు మందులు ఇచ్చి
పెంచబడిన జంతువు కాదు.
ఆ జంతువును చంపే సమయంలో రక్తంలోకి ఏ విషాలు విడుదల అయ్యాయో అని భయపడక్కర్లేదు. లేదా అది కుళ్ళే సమయాన ఏ విధమైన బాక్టీరియా
(కొన్ని వండిన కూడా అలానే ఉంటాయి) గురించి కూడా భయపడక్కర్లేదు. ఆ జంతువుకు ఎన్ని డజన్ల వ్యాధులు ఉన్నాయి లేదా అది పుట్టి నాటి నుండి
చనిపోయే వరకు ఎన్ని బాధలు పడింది అనే ఆలోచించనక్కర్లేదు. మరియు అంత ఎక్కువ డబ్బు ఖర్చుచేయక్కర్లేదు. అయినపట్టికీ మన శరీరానికి
కావలసిన మాంసకృత్తులు అన్నీ శాకాహారముతో లభ్యమవుతాయి.
మన స్వభావం మీద శాకాహారము చాలా లోతైన ప్రభావం మిగుల్చుతుంది. ప్రపంచమంతా కూడా శాకాహారమునకు అన్వయించుకుంటే, అది మానవ జాతి
గతినే మార్చేయగలదు.
-- ఆల్బర్ట్ ఐన్స్టీన్
మనుషుల ఆహారం కొరకు చాలా పదార్ధాలు ఉండగా, జంతువులను చంపుటలో అర్థం లేదు. మనిషి మాంసం లేకుండా బతకగలడు.
-- దలై లామా
మనిషికి స్వాతంత్ర్యం అవసరం అయితే, పక్షులు మరియు జంతువులను ఎందుకు పంజరాలలో ఉంచుతున్నారు? వాస్తవానికి మనిషి క్రూరత్వం
మృగాలని మించడం వలన అతడు మృగ రాజు. మనం ఇతరుల మరణం మీద జీవిస్తున్నాము. మనం శ్మశాన స్థలములము! నేను నా చిన్నతనం నుండే
మాంసమును వినియోగించడాన్ని త్యజించాను.
--లియొనార్డో డా విన్సీ
మన శరీర అవసరలను తృప్తి పరచుటకొనుటకు ఇతర జీవులను చంపడం మనుకొనుట అనేది ఆధ్యాత్మిక ప్రగతి పథంలో ఒకానొక స్థాయి నందు
ఖచ్చితంగా అడుగబడుతుంది.
-- గాంధీ
మాంస భక్షణ అనేది రెచ్చగొట్టబడని హత్య
-- బెంజమిన్ ఫ్రాంక్లిన్