జపం చేయునపుడు విడనాడవలసిన పది అపరాధములు


యతః ఖ్యాతిం యాతం కథమ్ ఉ సహతే తద్-విగర్హామ్ 

భగవంతుని నామమును ప్రచారము చేయుటలో జీవితమును ధారపోసిన భక్తులను దూషించుట . ఇటువంటి దూషించు కార్యాలను కృష్ణునితో అభిన్నమైనదైన, భగవన్నామం ఎప్పుడూ సహించదు.

ధియా భిన్నం పశ్యేత్ స ఖలు హరి-నామాహిత-కరః 

శివుడు, బ్రహ్మ మొదలగువారి  నామములు విష్ణువుని పవిత్ర నామముతో సమానము అని గాని, లేదా స్వతంత్రములని గాని భావించుట.

ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశములను ఉల్లంఘించుట.

వైదిక గ్రంథములను దూషించుట. 

హరి నామములకు దుర్వ్యాఖ్యానము చెప్పుట.

హరేకృష్ణ జప మహిమ కేవలము కల్పితమని భావించుట.

నా విద్యతే తస్య యమైర్ హి శుద్ధిః

హరే కృష్ణ మంత్రము అన్నీ పాప ఫలాలను ప్రతిఘటిస్తుందని తలచి, పాప కృత్యాలు చేస్తూ, అదే సమయాన వాటిని ఉపశమింపచేయడానికి హరే కృష్ణ మంత్రం జపించుట. ఇది హరి నామ యొక్క పాదాల చెంత చేయు అతి గొప్ప అపరాధం.

హరేకృష్ణ మాహామంత్ర జపమును కర్మకాండలో ఒక భాగముగా పరిగణించుట.

యశ్ చొపదేశఃశివ-నామాపరాధః

విశ్వాసము లేని వారికి భగవన్నామ మహిమను గూర్చి  ఉపదేశించుట.

అహం-మమాది-పరమో     నామ్ని సొ 'పి అపరాధ-కృత్

ఒకరు భగవన్నామ మహిమలను వినినా  కూడా "నేను ఈ శరీరాన్ని మరియు ఈ శరీరానికి సంబంధించిన నాది [అహం మమేతి] అని ఆలోచించి భౌతిక భావనతోనే జీవించుచూండుట, మరియు హరే కృష్ణ మహామంత్ర జపం పట్ల మర్యాద మరియు ప్రేమ చూపకపోవుట, ఇది ఒక అపరాధం"

పి ప్రమధః

అశ్రద్ధగా జపము చేయుట అనేది కూడా  అపరాధమే.